సాహితీ మిత్రులకు నమస్కారం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో పరిశోధన చేస్తున్న విద్యార్థి మిత్రులు నిర్వహిస్తున్న సాహిత్య వేదికే స్పృహ.ఇప్పటి వరకు పలు సభలు, చర్చా గోష్టులు నిర్వహించడమే కాకుండ ప్రముఖ కవుల సంస్మరణ సభలు నిర్వహించి నేటి తరంలో సాహిత్య స్పృహను కల్గిస్తున్నాము.
స్పృహ నిర్వహించిన కార్యక్రమ వివరాలు:
1.పత్రిక రచయిత,జర్నలిస్ట్ కందుకూరి రమేష్ బాబు గారి కోళ్ళ మంగారం ,బాలుడి శిల్పం, గణితం అతడి వేళ్ళమీద సంగీతం, డిసెంబర్ 6,1992,గడ్డి పరకలు పుస్తకాలపై చర్చా గోష్టి .
2.ప్రముఖ దళిత కవి,రచయిత, గాయకుడు గ్యార యాదయ్య గారి సంస్మరణ సభ .
3. ముస్లిం వాద రచనలైన జగ్నెకి రాత్ ,నఖాబ్, గవాయి ,అలావా ,ల పై చర్చా.
4.ప్రముఖ కవి బెల్లంకొండ రవికాంత్ కవితా సంపుటాలు ఒంటరి దుఃఖం, మంచుపూల వెన్నెల ల పరిచయం.
5.కవి, విమర్శకులు సీతారాం గారి వ్యాస సంపుటి "అదే పుట" పరిచయ సభతో పాటు దళిత్ వుమెన్ స్కాలర్స్ చేత ప్రసంగాలు. ఇలా గత విద్యా సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహించాము.
కావున ఇక ముందు మేం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంబంధించి మీ సలహాలు , సూచనలు మరియు అభిప్రాయాలను ఆహ్వానిస్తూ ......
మీ
'స్పృహ 'సాహిత్య వేదిక
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్